IBPS RRB Recruitment 2025 In Telugu: గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.

 IBPS RRB Recruitment 2025 In Telugu: గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.


IBPS RRB Recruitment 2025 In Telugu: గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.



  IBPS (ఇస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) RRB (రీజినల్ రూరల్ బ్యాంక్స్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ IBPS RRB Recruitment 2025 ద్వారా 13217 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ IBPS RRB Recruitment 2025 In Telugu కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Application Fee Imp Dates అన్ని చూద్దాం.


  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే మీ ఇంటికి దగ్గరలోనే పోస్టింగ్ రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రపదేశ్ గ్రామీణ బ్యాంకులో, తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ IBPS RRB Recruitment 2025 ద్వారా ఆఫీసు అసిస్టెంట్స్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-1(అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ స్కేల్-II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్(మేనేజర్), ఆఫీసర్ స్కేల్-II స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్), ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


   IBPS RRB Recruitment 2025 కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 01, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 21, 2025 వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.


Age Limit For IBPS RRB Recruitment 2025:


  Group -B:

Office Assistants: 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  Group - A Officers 


Officer Scale -1(Assistant Manager): 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Officer Scale - II(Manager): 21 సంవత్సరముల నుండి 32 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Officer Scale - III(Senior Manager): 21 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్ హాండికాప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.



ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు 



Educational Qualification For IBPS RRB Recruitment 2025:


  Office Assistants: బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  Officer Scale -1(Assistant Manager): బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అయితే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బండరీ, వెటిరినారు సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ లో డిగ్రీ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.


Officer Scale - II General Banking

Officer (Manager): బ్యాచిలర్స్ డిగ్రీ నీ 50% మార్కులతో పాసై న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బండరీ, వెటిరినారు సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ లో డిగ్రీ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.


  బ్యాంక్ లేదా ఫైనాన్స్ ఇంస్ట్యూట్ లో మేనేజర్ గా 2 సంవత్సరాలు చేసినట్లు ఎక్స్ పిరియన్స్ కలిగి ఉండాలి.


Officer Scale - II Specialist Officers (Manager):

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్: ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఈక్వాలెంట్ లో బ్యాచిలర్స్ డిగ్రీ నీ 50% మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

రెలెవెంట్ ఫీల్డ్ లో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.



చార్టెడ్ అకౌంటెంట్: చార్టెడ్ అకౌంటెంట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

చార్టెడ్ అకౌంటెంట్ గా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.



లా ఆఫీసర్: లా లేదా ఈక్వలెంట్ లో డిగ్రీ నీ 50% మార్కులతో పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు.

అడ్వకేట్ లేదా లా ఆఫీసర్ గా బ్యాంక్స్ లేదా ఫైనాన్షియల్ ఇంస్ట్యూషన్స్ లో 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.



ట్రెజరీ మేనేజర్: చార్టెడ్ అకౌంటెంట్ లేదా MBA ను ఫైనాన్స్ లో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

రెలెవెంట్ ఫీల్డ్ లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.




మార్కెటింగ్ ఆఫీసర్: మార్కెటింగ్ లో MBA చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

రెలెవెంట్ ఫీల్డ్ లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.



అగ్రికల్చరల్ ఆఫీసర్: అగ్రికల్చర్/ హార్టికల్చర్/ డైరీ/ అనిమల్ హస్బెండరీ/ ఫారెస్ట్రి/ వెటర్నరీ సైన్స్/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ పిస్సికల్చర్ లో 50% మార్కులతో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


రీలవెంట్ ఫీల్డ్ లో 2 సంవత్సరముల ఎక్స్ పెరియన్స్ కలిగి ఉండాలి.



Officer Scale-III (Senior Manager):బ్యాచిలర్స్ డిగ్రీ నీ 50% మార్కులతో పాసై న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బండరీ, వెటిరినారీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ లో డిగ్రీ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.


  బ్యాంక్ లేదా ఫైనాన్స్ ఇన్స్ట్యూషన్స్ లో ఆఫీసర్ గా 5 సంవత్సరాల ఎక్స్ పిరియాన్స్ ను కలిగి ఉండాలి.


ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. అలాగే సిబిల్ స్కోరు బాగా ఉండాలి.

Selection Process:


Office Assistants:

   ప్రిలిమ్స్
  మెయిన్స్

Officer Scale -1:

  ప్రిలిమ్స్
  మెయిన్స్
  ఇంటర్వ్యూ

Officer Scale II&III:

  సింగిల్ ఎగ్జామ్ 
  ఇంటర్వ్యూ
  
పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 

Examination Centers:


Preliminary:

  ఆంధ్రప్రదేశ్: అనంతపూర్, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

  తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్. 

Main Exam:

  ఆంధ్ర ప్రదేశ్: గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం.

  తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, వరంగల్.

Examination Fee:


  ఈ IBPS RRB Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 850 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 175 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Official Website: www.ibps.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు